Thaman : హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. 22 ఏళ్ళ తర్వాత అతనితో కలసి..!

by Prasanna |
Thaman : హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. 22 ఏళ్ళ తర్వాత అతనితో కలసి..!
X

దిశ, వెబ్ డెస్క్: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ( Thaman ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి సినిమాలను ఇట్టే హిట్ చేయగలడు. రీసెంట్‌గా రామ్ చరణ్ " గేమ్‌ ఛేంజర్‌ ", బాల కృష్ణ " డాకు మహారాజ్ " మూవీస్ కి ఆల్బమ్స్ ఇచ్చాడు. ముఖ్యంగా, బాలయ్య డాకు మహారాజ్ సినిమాకు తమన్‌ ఇచ్చిన బీజీఎం కి థియేటర్లు కూడా షేక్ అయ్యాయి. ఇలా మ్యూజిక్‌ తో అదరగొడుతున్న తమన్‌ను త్వరలోనే వెండి తెర మీద కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

ఆయన ఓ మూవీలో హీరోగా నటించబోతున్నారట. కానీ, అది మన తెలుగులో కాదు తమిళంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్‌ నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అథర్వతో కలిసి తమన్ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ మూవీకి తమన్ మ్యూజిక్ ను అందించడం లేదట. అయినా, ఇతను బిగ్ స్క్రీన్‌పై కనిపించడం ఇదే మొదటి సారి కాదు. శంకర్ మూవీ బాయ్స్‌ చిత్రంలో డ్రమ్స్‌ వాయించే బాయ్‌గా నటించాడు.

మిస్టర్ మజ్ను, బేబి జాన్ లాంటి మూవీస్ లో కూడా మెరిశాడు. గతంలో దేవీశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంత వరకు జరగలేదు. మరి, తమన్ విషయంలో ఇది నిజమవుతుందో ? లేదో చూడాల్సి ఉంది. తమన్ హీరో అయితే మ్యూజిక్‌కు పుల్ స్టాప్ పెడతాడా.? లేక రెండు చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది.

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న తమన్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అని సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం, ఆయన చేతిలో ప్రభాస్- మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్, పవన్ కల్యాణ్- ఓజీ, బాలకృష్ణ-అఖండ-2లాంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవే కాకుండా, కొత్త సినిమాలకు కూడా తమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇలాంటి టైం లో ఇది సెట్‌ అవుతుందా అనేది ఇంకో చర్చ. అయితే, నిజంగానే హీరోగా నటించబోతున్నాడా లేక ఇది రూమరేనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story

Most Viewed