- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mrunal Thakur: ఫారెవర్ అని క్యాప్షన్ జోడించి కిస్, హగ్గులతో ముంచెత్తుతోన్న టాలీవుడ్ బ్యూటీ

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur)క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగులోన కాకుండా.. మరాఠీ, హిందీ భాషల్లో కూడా నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. తెలుగులో సీతారామం (Sitaramam) సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
తర్వాత హాయ్ నాన్న(Hay nanna), ది ఫ్యామిలీ స్టార్ (The Family Star), కల్కి 2898 వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించింది. వీటితో పాటుగా టూఫాన్ (Toofan), లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories), జెర్సీ (Jersey), బాట్లా హౌస్ (Batla House), గుమ్రాహ్ (Gumrah), ఆంక్ మిచోలీ (Ank Micholi), నందన్ గారు నమస్కారం (Nandan garu namaskaram) వంటి హిందీ, మరాఠి చిత్రాల్లో నటించి జనాల్ని మెప్పించింది. అలాగే బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
తూహీహీ (Tooheehee) అనే మూవీలో అటు బాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు దక్కించుకుంది. రవి ఉద్యార్ (Ravi Udyar) దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిద్ధార్థ్ చతుర్వేది (Siddharth Chaturvedi) కీలక పాత్రలో నటించారు. ఇకపోతే మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానుల్ని అలరిస్తుందన్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పర్సన్‌తో చాలా క్లోజ్‌గా దిగిన ఫొటోలు పంచుకుంది. ఈ పిక్స్‌కు ఫారెవర్ అని ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ ఫొటోలు చూస్తుంటే మృణాల్‌కు చాలా క్లోజ్ అయిన వ్యక్తిలా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో ఆకట్టుకుంది.
READ MORE ...
Erica Fernandez: శారీరకంగా చాలా వేధించే వాడు.. బ్రేకప్‌పై ఇన్నాళ్లకు మౌనం వీడిన యంగ్ హీరోయిన్
- Tags
- Mrunal Thakur