- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కన్నప్ప నుంచి మరో అప్‌డేట్.. ఆశక్తికరంగా మహాదేవ శాస్త్రీ లుక్

దిశ, సినిమా: డైనమిక్ హీరో విష్ణు మంచు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ (Kannappa)సినిమా నుంచి ప్రతి సోమవారం ఏదో ఒక అప్‌డేట్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మోహన్ బాబు (Mohanbabu) మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను ఈనెల 19న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ‘మార్చి 19న ‘కన్నప్ప’ నుంచి మహాదేవ శాస్త్రి గర్జన ప్రతిధ్వనిస్తోంది.. శైవ తుఫానుకు సిద్ధంగా ఉండండి!’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మోహన్ బాబు గంభీరంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో.. విష్ణు కన్నప్పగా, అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడిగా, ప్రభాస్ (Prabhas) రుద్రుడిగా, కాజల్ (Kajal Agarwal) పార్వతీ మాతగా, మోహన్ బాబు మహాదేవ శాస్త్రీ పాత్రల్లో నటిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
READ MORE ...
Sukumar: పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడిపై పొగడ్తల వర్షం కురిపించిన ప్రముక దర్శకధీరుడు..?