- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mirai: యంగ్ హీరో బర్త్‌డే కానుకగా.. ‘మిరాయ్’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్
దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి నేడు స్టార్ హీరో రేంజ్‌కు ఎదుగుతున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘హనుమాన్’ మూవీతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే తాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇదిలా ఉంటే నేడు (ఆగస్టు 23) తేజ సజ్జా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఈ మూవీ యూనిట్ బర్త్‌డే విషెస్ తెలుపుతూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో తేజ సజ్జా.. పై నుంచి కింద పడిపోతుండగా కింద ఉన్న బిల్డింగ్‌లు కూలిపోతున్నాయి. ఏదో మంత్రించిన కర్ర ఆయన పట్టుకున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ అయితే హైప్ పెంచేస్తుంది.
కాగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Strap in for an adrenaline ride 😎
— People Media Factory (@peoplemediafcy) August 23, 2024
The #SuperYodha is born 🥷⚡
Team #MIRAI ⚔️ wishes the
SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥
Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP
(video link credits to People Media Factory X account)