‘pushpa-2’ సినిమాలో మెగాస్టార్ chiranjeevi .. హింట్ ఇచ్చిన డైరెక్టర్ ప్లాన్ అదిరిందిగా!

by Hamsa |   ( Updated:2023-10-21 05:41:31.0  )
‘pushpa-2’ సినిమాలో మెగాస్టార్ chiranjeevi .. హింట్ ఇచ్చిన డైరెక్టర్ ప్లాన్ అదిరిందిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘పుష్ప’. ఈ సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎటువంటి క్రేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించింది. అయితే దీనికి సీక్వెల్‌గా పుష్ప-2 కూడా త్వరలో రాబోతుందని డైరెక్టర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి పుష్ప-2కి సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా, పుష్ప-2లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లు సుకుమార్ పుష్పలోనే హింట్ ఇచ్చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. పుష్ప 1 లో పుష్పరాజ్ శ్రీవల్లి బ్రిడ్జి మీద మాట్లాడుకునే సీన్ ఉంటుంది.

ఆ సమయంలో శ్రీ వల్లి తన స్నేహితులతో కలిసి ‘ చూడాలని ఉంది ‘ సినిమాకు వెళ్లాలి అనుకుంటుంది. అంటే అక్కడ చిరంజీవికి శ్రీవల్లి పెద్ద ఫ్యాన్. ఇక ఇదే పాయింట్ ను పట్టుకుని సుకుమార్ పుష్ప 2 లో మంచి సీన్స్ జోడించారట. పుష్ప 2 లో శ్రీవల్లి చిరంజీవి సినిమాకు వెళుతుందట. ఈసారి భర్త పుష్ప రాజ్ తో కలిసి చిరంజీవి సినిమాలు చూసి శ్రీవల్లి ఎంజాయ్ చేస్తుందట. అంతేకాకుండా అల్లు అర్జున్ చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటలను రీమిక్స్ చేసి బన్నీ తనదైన స్టైల్ లో డాన్స్ చేయబోతున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ ను కూడా అక్కడక్కడ జోడించారట. ఇలా పుష్ప-2లో చిరంజీవిని కూడా పెట్టి భారీ హైప్‌ను క్రియోట్ చేయడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More: ఇప్పుడు విడిపోయే సమయం వచ్చింది నా ప్రయాణం వేరు.. శిల్పాశెట్టి భర్త ఆసక్తికర ట్వీట్..

Advertisement

Next Story