మెగా కోడలు లావణ్య గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న నెటిజన్లు.. దేని గురించో తెలిస్తే షాక్ అవుతారు..!

by sudharani |   ( Updated:2023-06-16 02:47:17.0  )
మెగా కోడలు లావణ్య గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న నెటిజన్లు.. దేని గురించో తెలిస్తే షాక్ అవుతారు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట ఎంగేజ్మెంట్‌తో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి మొగా అభిమానుల్లో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు లావణ్య ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? తన క్యాస్ట్ ఏంటి..? అంటూ అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. మరీ అభిమానుల సెర్చింగ్‌లో బయటపడ్డా లావణ్య త్రిపాఠి గురించి అసలు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్ట్ న్యాయవాది. తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉంటుంది. లావణ్యకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. ముంబైకి వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది లావణ్య. మోడలింగ్ మీద ఇంట్రెస్ట్‌తో ఆమె సినీ రంగంలోకి ప్రవేశించిది. ఇక 2006 లో లావణ్య మిస్ ఉత్తరాఖండ్ కిరీటాన్ని సైతం గెలుచుకుంది. 2012 లో ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకున్న అమ్మడు.. మంచి డీసెంట్ హిట్స్ అందుకుంది.

2017 లో వచ్చిన మిస్టర్ సినిమా ద్వారా వరుణ్ తేజ్‌తో లావణ్యకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అంతరిక్షం సినిమాతో వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. లావణ్య, వరుణ్ చెల్లి నిహారికకు జిమ్ మేట్. నిహారికకు కూడా ఫ్రెండ్ కావడంతోనే లావణ్య, వరుణ్‌ల పరిచయం మరింత బలపడింది. అంతే కాకుండా నిహారిక పెళ్లిలో లావణ్య ఒక్కతే ఆమె పెళ్లి మొత్తంలో సందడి చేసింది. కాగా.. వరుణ్-లావణ్యల ఐదేళ్ల ప్రేమ.. ఇప్పుడు పెళ్లిగా మారనుంది.

Read more: పెళ్లి వేళ బయటపడ్డ వరుణ్ ప్రేమ వ్యవహారాలు.. లావణ్య రియాక్షన్ ఇదే!

Advertisement

Next Story

Most Viewed