Meenakshi Chowdhury: ఆ హీరో అంటే ఇష్టం.. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటూ షాకిచ్చిన మీనాక్షి (వీడియో)

by Hamsa |   ( Updated:2025-01-23 13:45:02.0  )
Meenakshi Chowdhury: ఆ హీరో అంటే ఇష్టం.. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటూ షాకిచ్చిన మీనాక్షి (వీడియో)
X

దిశ, సినిమా: మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గత ఏడాది నాలుగు ఐదు చిత్రాల్లో నటించిన ఆమె రెండు బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఈ అమ్మడు ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా నటించారు. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై హిట్ టాక్‌తో థియేటర్స్‌లో దూసుకుపోతుంది.

అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. ఈ నేపథ్యంలో.. మీనాక్షి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పి షాకిచ్చింది. ‘‘నా క్రష్ ప్రభాస్(Prabhas). ఆయనంటే నాకు పిచ్చి చాలా ఇష్టం. ప్రభాస్ పొడుగ్గా హ్యండ్సమ్‌గా ఉంటాడు’’ అని చెప్పుకొచ్చింది. ఇక యాంకర్ కాబోయే భర్త గురించి అడగ్గా.. నా కాబోయే భర్త గురించి వంద విషయాలు నా మనసులో ఉన్నాయి. ముఖ్యంగా హైట్ ఉండాలి. అలాగే మంచి మనసు ఉన్న వ్యక్తి కావాలి.

అంతేకాకుండా ఇంటెలిజెంట్ అయి ఉండాలి. సాధారణంగా ఓ మగాడిలో నాకు కావాల్సిన అంశాలు ఇవే. నేను మంచి హైట్‌గా ఉంటాను. నా ఎత్తు 5.8 అడుగుల ఎత్తు. కాబట్టి నా ఎత్తుకు తగిన వ్యక్తి ఉండాలని కోరుకొంటాను. నా కంటే ఎత్తు తక్కువగా ఉంటే ఫ్లాట్‌ చెప్పులేసుకొని ఉండలేను కదా. నా హైట్‌కు తగిన అబ్బాయి, నాలాంటి రూపానికి తగిన వ్యక్తి కావాలి. నాకు సమానంగా మేల్ వెర్షన్‌తో పాటు ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా’’ అని తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Next Story