Puri Jagannath: చాలా మంది దానివల్లే విడాకులు తీసుకుంటున్నారు.. అసలు విషయం బయటపెట్టిన పూరి జగన్నాథ్

by Hamsa |
Puri Jagannath: చాలా మంది దానివల్లే విడాకులు తీసుకుంటున్నారు.. అసలు విషయం బయటపెట్టిన పూరి జగన్నాథ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) ఈ ఏడాది ‘డబుల్ ఇస్మార్ట్’(Double iSmart) తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి సినిమా ప్రకటించకుండా పాడ్‌కాస్ట్(Podcast) స్టార్ట్ చేసి పలు విషయాలు వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటే ఏదో ఒక టాపిక్ మీద వీడియోలు చేస్తున్నారు. తాజాగా, పూరి జగన్నాథ్ ఈ ఏడాది అయిపోతుండటంతో ‘న్యూ రిజల్యూషన్’ గా సోషల్ మీడియా(Social Media)కు దూరం అవ్వాలని సూచించారు. అంతేకాకుండా దానివల్లే విడాకుల పెరిగిపోతున్నాయని చెప్పుకొచ్చారు. ‘‘ఏ పని చేసినా ఫొటోలు తీసుకోవడం సోషల్ మీడియాలో పెట్టడం చేస్తున్నారు.

చివరకు బెడ్‌రూమ్‌లో తింటునప్పుడు కూడా పిక్ తీసుకుంటున్నారు. డిజిటల్ అడిక్షన్ పెరిగిపోయింది. అయితే సోషల్ మీడియా వల్ల ఎంతో మంది దంపతులకు గొడవలు జరుగుతున్నాయి బంధాలు దెబ్బతింటున్నాయి. సోషల్ వల్లనే విడాకులు(Divorce) తీసుకుంటున్నారు. మీరు రిలేషన్‌షిప్‌(Relationship)లో ఉన్నా.. కొత్తగా పెళ్లైనా సరే దయచేసి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మీ పార్ట్‌నర్ ప్రపంచం అనుకొని బతకండి. మీరు ఆనందంగా ఉన్నా.. బాధలో ఉన్నా పోస్టులు పెట్టకండి. ముఖ్యంగా అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం మీ ఇంట్లో జరిగే విషయాలను షేర్ చేయవద్దు. నా మాట విని పెళ్లైన వారంతా సోషల్ మీడియాకు దూరంగా ఉండండి జీవితాలు మారుతాయి. అలాగే విడాకులు కూడా తగ్గుతాయి’’ అని చెప్పుకొచ్చారు.


Next Story