MANAS NAGULAPALLI: తండ్రైన 'బ్రహ్మముడి' రాజ్.. నెట్టింట వైరల్ అవుతున్న స్పెషల్ పోస్ట్

by Kavitha |   ( Updated:2024-09-11 14:42:52.0  )
MANAS NAGULAPALLI:  తండ్రైన బ్రహ్మముడి రాజ్.. నెట్టింట వైరల్ అవుతున్న స్పెషల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి(MANAS NAGULAPALLI) అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ‘బ్రహ్మముడి’(BRAHMAMUDI) అనే సీరియల్‌లో నటిస్తున్నాడు. ఈ ధారావాహికలోని ఇతని నటనకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అలాగే బిగ్‌బాస్ (BIG BOSS) సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అక్కడ కూడా తన గేమ్, బిహేవియర్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. మంగళవారం (సెప్టెంబర్ 10) ఉదయం తన భార్య సీమంతం(BABY SHOWER) ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మానస్.. కొద్ది సేపటికే తాను తండ్రినయ్యానన్న గుడ్ న్యూస్ చెప్పాడు. తన సతీమణి శ్రీజ నిశ్వంకర పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు 'బేబీ బాయ్' (BABY BOY) అంటూ ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మానస్, శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గత ఏడాది నవంబర్‌లో మానస్, శ్రీజల వివాహం జరగగా.. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా తాము తల్లిదండ్రులం కానున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.




Advertisement

Next Story