Kannappa: ‘కన్నప్ప’ నుంచి లవ్ సాంగ్ రిలీజ్.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న విష్ణు, ప్రీతి ముకుందన్

by sudharani |   ( Updated:2025-03-10 15:00:15.0  )
Kannappa: ‘కన్నప్ప’ నుంచి లవ్ సాంగ్ రిలీజ్.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న విష్ణు, ప్రీతి ముకుందన్
X

దిశ, సినిమా: డైనమిక్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ (Kannappa) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ నుంచి వచ్చిన అన్నీ అప్‌డేట్ ఆకట్టుకోగా.. ‘శివ శివ శంకర’ పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన సెకండ్ టీజర్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ శిఖరానికి చేరుకున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా మరో బ్యూటీఫుల్ అప్‌డేట్ ఇచ్చారు.

విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే లవ్ మెలోడీ సాంగ్‌(Melody song)ను విడుదల చేశారు. ఈ పాటను రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభు దేవా, బృందా కొరియోగ్రఫీ చేసిన విధానం, విష్ణు మంచు-ప్రీతి ముకుందన్‌ను చూపించిన తీరు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. కాగా.. శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్నారు. విష్ణు మంచు కన్నప్పగా, అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడిగా, ప్రభాస్ (Prabhas) రుద్రుడిగా, కాజల్ (Kajal) పార్వతీ మాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. మోహన్ బాబు (Mohan Babu), మోహన్‌లాల్, బ్రహ్మానందం వంటి అద్భుతమైన తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప చిత్రానికి ముఖేక్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Fore More Movie News : https://www.dishadaily.com/movie

Next Story