- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kannappa: ఈ సినిమాతో చాలా నేర్చుకున్నా.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించిన ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ప్రమోషన్స్‌లో యాక్టీవ్ అయిన చిత్ర బృందం.. వరుస అప్‌డేట్స్ ఇస్తూ ‘కన్నప్ప’పై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ చిట్ చాట్ (chit chat)లో పాల్గొన్న విష్ణు మూవీ గురించి మాట్లాడుతూ.. ‘ఈ మూవీ నటీనటుల లుక్స్ రివీల్ (Looks Reveal) చేసేటప్పుడు నాన్నతో కలిసి మేము అందరం చాలా మాట్లాడుకుని.. అందరి అంగీకరంతో చేసినవే. నేను కూడా ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ (Production Department) దగ్గర నుంచి, అసలు ఎంత మంది ఉంటారు ఏంటీ అనేది చూసుకున్నాను. అన్ని డిపార్ట్‌మెంట్స్ కలిసి పని చేసి ఈ లుక్స్ అనేది తీసుకొచ్చారు. ఇక మీ అందరికి ‘కన్నప్ప’ గురించి తెలిసింది రెండు సంవత్సరాల నుంచే. కానీ నేను నా ‘కన్నప్ప’ జర్నీ 2014 నుంచి మొదలైంది. లాంగ్ టర్మ్ (long term) నుంచి ఈ మూవీ కోసం నేను వర్క్ చేస్తున్నాను. మీరందరూ మూవీని చూసి.. మమ్మల్ని బ్లెస్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.