Rajini kanth: హైదరాబాద్, వైజాక్‌కు రానున్న రజినీకాంత్.. కారణం ఏంటంటే?

by sudharani |
Rajini kanth: హైదరాబాద్, వైజాక్‌కు రానున్న రజినీకాంత్.. కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: ‘జైలర్’ (Jailer) సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajini kanth).. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ (Coolie). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో కూలీ చిత్రంపై సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, మంజుమ్మెల్‌ బాయ్స్ ఫేమ్ సౌబిన్‌ షాహిర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట స్ర్పెడ్ అవుతోంది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కూలీ’ చిత్రం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ చెన్నై (Chennai)లో చిత్రీకరణ చేసుకుంటోందని తెలుస్తుండగా.. ఇక చివరి షెడ్యూల్ వైజాగ్ (Vizag), హైదరాబాద్‌ (Hyderabad)లలో జరగబోతుందని టాక్. అంతే కాదు మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసే పనిలో పడ్డారట చిత్ర బృందం. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ‘కూలీ’ ఫస్ట్ గ్లింప్స్‌ (First glimpses) విడుదల చేయనున్నారట. కాగా.. బంగారం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుకున్న ఈ యాక్షన్‌ డ్రామా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు టీమ్. అలాగే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.

Next Story