‘కిల్లర్’ మూవీ అప్డేట్.. రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్

by Hamsa |
‘కిల్లర్’ మూవీ అప్డేట్.. రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి జ్యోతిరాయ్(Jyothi Rai) హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ‘కిల్లర్’(Killer) టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రణయ్ కామత్(Pranay Kamath), పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా, కిల్లర్ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ పోస్టర్ షేర్ చేయడంతో పాటు అప్డేట్ ఇచ్చారు. సెకండ్ షెడ్యూల్ డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.



Next Story