రౌడీ హీరోతో రొమాన్స్ చేయనున్న రామ్ చరణ్ హీరోయిన్?

by Disha News Desk |
రౌడీ హీరోతో రొమాన్స్ చేయనున్న రామ్ చరణ్ హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం విజయ్ తన పాన్ ఇండియా మూవీ 'లైగర్' షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. ఇంతలో విజయ్ తన 11వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీకి ఇంకా నామకరణం చేయకపోయినా విజయ్‌11గా ప్రచారం జరుగుతోంది. తాజాగా.. ఈ సినిమా హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో భారీ చర్చే జరుగుతోంది.

ఇందులో విజయ్ సరసన రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించిన హీరోయిన్ కియారా అద్వానీ నటించనుందని, ఈ మూవీ కోసం మేకర్స్ కియారాను సంప్రదించారని, విజయ్‌తో చేసేందుకు కియారా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు దీనిపై క్లారిటీ లేదు. త్వరలో ఏమైనా అనౌన్స్‌మెంట్ వస్తుందేమో చూడాలి.

Advertisement

Next Story