Keerthi Suresh: గోవాలో మహానటి పెళ్లి వేడుక.. వైరల్ అవుతోన్న వెల్‌కమ్ బోర్డ్(పోస్ట్)

by Kavitha |
Keerthi Suresh: గోవాలో మహానటి పెళ్లి వేడుక.. వైరల్ అవుతోన్న వెల్‌కమ్ బోర్డ్(పోస్ట్)
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. తన చిన్న నాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా కీర్తీ రీసెంట్‌గా పోస్ట్ కూడా పెట్టింది.

అయితే ఈ భామ ఈ రోజు తన ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో కీర్తి, ఆంటోని పేర్లు వెల్‌కమ్ బోర్డ్ పై రాసి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఆల్‌రెడీ మ్యారేజ్ పనులు స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. అలాగే ఈ పోస్ట్‌కు ఈ అమ్మడు రెండు హార్ట్ సింబల్‌ని జోడించింది. కాగా ఈ భామ డిసెంబర్ 12న(నేడు) గోవాలో డెస్టినేషన్ పెళ్లి చేసుకోనుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed