Katrina Kaif: భార్య అక్కడ.. భర్త ఇక్కడ.. కానీ ఆస్ట్రియా టూర్‌లో కత్రీనా ఎవర్ని ముద్దు పెట్టుకుందో తెలుసా?

by Vennela |
Katrina Kaif: భార్య అక్కడ.. భర్త ఇక్కడ.. కానీ ఆస్ట్రియా టూర్‌లో కత్రీనా ఎవర్ని ముద్దు పెట్టుకుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : Katrina Kaif: కత్రినా కైఫ్... టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయంతో సౌత్ లోనూ, నార్త్ లోనూ కావాల్సినంత పాపులారిటీని సొంతం చేసుకుంది. మోడ్రన్ డ్రెస్సులో అయినా..చీరకట్టులో అయినా..కత్రినా అందానికి అంతా ఫిదా అవ్వాల్సిందే.

తాజాగా కత్రినా కైఫ్ ఆస్ట్రియా టూర్ లో ఉంది. మూడు రోజుల క్రితం మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తోంది. తన భర్త విక్కీ కౌశల్ చావా మూవీతో భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ మీట్ లలో కౌశల్ బిజీబిజీగా గడుపుతున్నారు. కత్రీనా మాత్రం ఆస్ట్రియన్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. టూర్ కు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మంచుతో కప్పిన పర్వతాల నడుమ ప్రశాంతమైన సరస్సు దృశ్యాలను ఆస్వాదిస్తున్న ఫొటోలను పంచుకున్నారు. పర్ఫెక్ట్ రీసెట్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. సూర్యుడిని ముద్దు పెట్టుకున్న సెల్ఫీని క్లి క్ చేస్తూ కత్రినా సందడి చేస్తోంది.

కత్రినా బస చేసిన రిసార్ట్ చుట్టు మంచుతో కప్పిన ఉన్న కొండల చిత్రాలను షేర్ చేసింది. "ఆ సమయంలో మళ్ళీ #mayrlifealtausse లో ... ఈ ప్రదేశం అద్భుతమైన ప్రశాంతత, అందం నన్ను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది ... అద్భుతమైన మంచుతో కప్పిన పర్వతం సరస్సులో మంచు కరుగుతున్న శబ్దంతో నడుస్తుంది ... సమయం నిజంగా నిలిచిపోతుంది. నేను ఎల్లప్పుడూ స్పష్టత క్షణాలను కనుగొంటాను. అవి కొన్నిసార్లు అంతుచిక్కనివిగా ఉంటాయి. మిమ్మల్ని కుటుంబంలా భావించేలా చేసే, నిజంగా బహుమతి పొందిన అద్భుతమైన బృందం ... పరిపూర్ణ రీసెట్ ... @mayrlife_official," అని కత్రినా ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.



Next Story