- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jagapathi Babu: ‘ఆడపిల్లలతో రంగుల రంగోలి’ అంటూ జగపతి బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన ఆయన.. ప్రస్తుతం విలన్ క్యారెక్టర్‌లో మెప్పిస్తున్నాడు. రీసెంట్‌గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప-2’ మూవీలో కూడా తన నటనతో అలరించాడు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ లెటస్ట్ ఫొటోస్, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా జగపతి బాబు ఎక్స్ వేదికగా ఓ వీడియో పెట్టాడు. అందులో లేడీస్‌తో మెహందీ పెట్టించుకుంటూ వారితో ముచ్చట్లు పెడుతున్నారు. చిన్న పిల్లవాడిలా మారి అల్లరి కూడా చేస్తున్నారు. అలాగే ‘ఆడపిల్లలతో రంగుల రంగోలి’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ ఏజ్‌లో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు జగపతి బాబు లేటెస్ట్ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.