‘పుష్ప-2 ఇంకో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినా సరే.. ఆ సినిమాతో పోల్చకండి ప్లీజ్’

by Gantepaka Srikanth |
‘పుష్ప-2 ఇంకో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినా సరే.. ఆ సినిమాతో పోల్చకండి ప్లీజ్’
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 చిత్రం(Pushpa-2 Movie) దుమ్ములేపుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం అన్ని భాషల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన మాస్ సినిమాలైన రంగస్థలం(Rangasthalam), పుష్ప-2(Pushpa-2 )లలో మీకు ఏదంటే బాగా ఇష్టం’ అని పోస్టు పెట్టారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ అభిమాని అయితే.. పుష్ప-2 మరో వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించినా రంగస్థలం సినిమాతో పోల్చకండి ప్లీజ్’ అని కామెంట్ చేశారు. రంగస్థలం ఒక మాస్టర్‌పీస్ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మా హీరో సినిమా గొప్ప అంటే మా హీరో సినిమా గొప్ప అని చరణ్, బన్నీ అభిమానులు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు.










Advertisement

Next Story

Most Viewed