- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rishabh Shetty: ‘ఆ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం’.. ప్రముఖ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ది ఫ్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’('The Fried of India: Chhatrapati Shivaji Maharaj) సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇలాంటి బయోపిక్(Biopic)లో చాన్స్‌లు రావడం రేర్ అని.. అంతేకాకుండా శివాజీ ఛత్రపతికి పెద్ద అభిమానినని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయన రోల్ పోషించడానికి రెడీగా ఉన్నానని అన్నారు. దర్శక, నిర్మాతలొచ్చి.. స్టోరీ చెప్పగానే క్షణం కూడా థింక్ చేయకుండా ఒకే చెప్పానని పేర్కొన్నారు. చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ద్వారా శివాజీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటానని.. అందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఇకపోతే రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సందీప్ సింగ్(Sandeep Singh) రూపొందిస్తోన్న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 2027 జనవరి 21 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
- Tags
- Rishabh Shetty