- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ పెట్టింది ఎవరో తెలిస్తే సూపర్ అనడం ఖాయం!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంతలా పాపులారిటీ తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. అందులో ఆయన నటనతో ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు. ప్రస్తుతం తారక్- కొరటాల శివ కాంబోలో ‘దేవర’ సినిమా రాబోతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా చేస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. దేవర అక్టోబర్ 10 రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో డ్యూయల్ రోల్స్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అసలు ‘దేవర’ టైటిల్ ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయంలో ముందు నుంచే కొరటాల శివ జాగ్రత్త పడుతూ వస్తున్నాడట. కాబట్టి దీని టైటిల్ బాధ్యతను మొత్తం ఎన్టీఆర్‌కు ఇస్తే బాగుంటుందని డిసైడ్ అయి ఆయనకు చెప్పారట. దీంతో తారక్ ఈ కథను లక్ష్మీ ప్రణతికి చెప్పడంతో ఆమెనే దేవర అయితే బాగుంటుందని ఈ టైటిల్ సజెస్ట్ చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దేవా పాత్రలో తండ్రిగా.. వరా క్యారెక్టర్‌లో కొడుకుగా కనిపించబోతుండటంతో అలా పెట్టినట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ అని అంటున్నారు.
- Tags
- Devara movie