- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చాన్స్ అడిగితే గెస్ట్ హౌస్కు రమ్మన్నాడు.. ‘బాహుబలి’ యాక్టర్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో చాలా మంది కాస్టింగ్ కౌచ్‌కు గురైన విషయం తెలిసిందే. ముఖ్యంగా చాన్సుల కోసం ప్రయత్నించే వాళ్ళు చాలా ఇబ్బందులు పడినట్లు ఇటీవల కొందరు మీడియా ముఖంగా తెలిపారు. తాజాగా, మరో సీనియర్ నటి ప్రమీలా రాణి ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విషయాలు తెలిపింది. ఆమె దాదాపు 45 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాహుబలి, విక్రమార్కుడులో చేసిన పాత్రలకు బాగా ఫేమ్ వచ్చింది. అయితే ప్రమీల ఇన్నాళ్లకు ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ‘‘చిన్న వయసులోనే పెళ్లి చేశారు. నాకు పిల్లలు పుట్టరని తెలిసి.. కొంతకాలానికి భర్త వదిలేసి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు తల్లిదండ్రులు రెండో పెళ్లి చేశారు. 23 ఏళ్లప్పుడు రెండో భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఒంటిరిగానే ఉన్నా. కుటుంబ పోషనకు సినిమాల్లోకి వెళ్లా. కానీ ఓ వ్యక్తి సినిమాలో అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. గెస్ట్ హౌస్ కు రమ్మని పిలిచాడు. దానికి ఒప్పుకోకపోయే సరికి ఆ సినిమాలో చాన్స్ పోయింది. అది తప్ప ఇంకెవరు నాతో అలా ప్రవర్తించలేదు’’ అంటూ చెప్పుకొచ్చిందట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.