తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు బాగా అర్థమైంది.. దుమారం రేపుతున్న నిర్మాత కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-02-17 05:40:14.0  )
తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు బాగా అర్థమైంది.. దుమారం రేపుతున్న నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన ‘లవ్ టుడే’(Love Today) సినిమాతో ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్నాడు. ఈ ఒక్క చిత్రంతోనే ఆ హీరో గ్రాఫ్ చేంజ్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రజెంట్ ప్రస్తుతం ‘డ్రాగన్’(Dragon) మూవీలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కయాద్ లోహర్(Kayad Lohar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అశ్వత్ మరి ముత్తు(Ashwath Marimuthu) దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ టీమ్ హైదరాబాలో ‘డ్రాగన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఇక కార్యక్రమానికి గెస్ట్‌గా దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar), నిర్మాత ఎస్ కె ఎన్(SKN) హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో నిర్మాత చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

ఆయన మాట్లాడుతూ.. ‘మొదటగా హీరోయిన్ కాయాద్ లోహర్ గారికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి స్వాగతం తెలియజేస్తున్నాము. టాలీవుడ్‌లో మేము తెలుగు వచ్చిన హీరోయిన్ల కంటే తెలుగు రాని హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతాం. అంతే కాదు దానికి కారణం కూడా ఉంది. తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది. ఇక నుంచి నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ తెలుగు రాని హీరోయిన్లని తీసుకోవాలని అనుకుంటున్నాము’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఎస్‌కెఎన్ చేసిన కామెంట్స్ నెట్టింట కాంట్రవర్సీగా మారాయి. కాగా ఈ వ్యాఖ్యలు యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే చేశారని పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాకు ఎస్‌కెఎన్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. మరి ఎస్‌కెఎన్ కామెంట్స్ వైష్ణవిని ఉద్దేశించి చేసినవేనా లేక మరెవరైనా హీరోయిన్స్ గురించి అన్నారా అనేది తెలియాల్సి ఉంది.

Next Story