- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నా 16ఏళ్ల సినీ కెరీర్‌లో అలా చేయండి అని నేను ఎప్పుడూ అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నా.. నాని ఎమోషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్(Nani) నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కోర్టు(Court- State vs A Nobody). ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్(Ram Jagadeesh) తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో శివాజీ(Shivaji), సాయి కుమార్(Sai kumar), రోహిణి(Rohini), హర్షవర్ధన్(Harsha Vardhan), శ్రీదేవి(Sridevi) వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గత ఏడాది ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఈ క్రమంలో నాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘నా 16 ఏళ్ల సినీ కెరీర్‌లొ దయచేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడూ అడిగింది లేదు. కానీ, ఈ మూవీ విషయంలో ఆ మాట అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ మిస్సవ్వకూడదని నా కోరిక. అందుకే ఇంతగా బతిమాలాడుతున్నా.
ఇది మీ అంచనాల్ని అందుకోలేదు అనిపిస్తే మరో రెండు నెలల్లో రిలీజ్ కానున్న నా ‘హిట్-3’(HIT-3)ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా నేనేమి చెప్పలేను. ఎందుకంటే దీనికన్నా 10 రెట్లు ఎక్కువగా హిట్-3పై ఖర్చు పెట్టాను. ఈ నెల 14 వరకే ఈ సినిమా చూడమని నేను అందరికీ చెప్తా. ఆ తర్వాత నుంచి మీరే ఆ మాటట ప్రతి ఒక్కరికీ చెప్తారు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.