నా తల్లిదండ్రుల వల్లే మద్యానికి బానిసయ్యాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-12-29 17:30:35.0  )
నా తల్లిదండ్రుల వల్లే మద్యానికి బానిసయ్యాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురుగా శృతి హాసన్(Shruti Haasan) సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా గత కొద్ది కాలం నుంచి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో కూడా యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్ల మనసులు గెలుచుకుంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘నాకు దేవుడిపై చాలా నమ్మకం ఉంది.

కానీ మా నాన్న కారణంగా గుడికి వెళ్లలేక పోయేదాన్ని. ఆయన ఇంట్లో వాళ్లను దేవాలయాలకు వెళ్లి నిచ్చేవారు కాదు. నేను మాత్రం చర్చికి వెళ్లేదాన్ని ఈ విషయం మా నాన్నకు చాలా కాలానికి తెలిసింది. అసలు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దేవుడిపై నాకున్న నమ్మకమే కారణం. అయితే నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడే మా అమ్మానాన్న విడాకులు(Divorce) తీసుకుని విడిపోవడంతో చాలా బాధపడ్డాను. ఈ సంఘటన వల్ల పూర్తిగా మద్యానికి బానిసయ్యాను. అంతేకాకుండా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. మానసిక ఆరోగ్యం కూడా క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజమే.. చాలా మందికి ఈ విషయం తెలియదు. నా తల్లిదండ్రుల విడాకులు నా మనసుకు చాలా బాధ కలిగించింది’’ అని చెప్పుకొచ్చింది.

Read More...

Tamannaah: అందాల తార తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..!

Advertisement

Next Story