Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ చిత్రంపై పెరిగిపోతున్న హైప్.. తాజా అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం

by sudharani |
Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ చిత్రంపై పెరిగిపోతున్న హైప్.. తాజా అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం
X

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్- కొంచెం క్రాక్’ (Jack). బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ‘జాక్’ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. సిద్ధు, భాస్కర్‌ల క్రేజీ కాంబో కోసం ఆడియన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ (Update) ఇచ్చారు మేకర్స్. సౌత్‌లో సామ్ సీఎస్‌(Sam CS)కి సంగీత దర్శకుడిగా ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి క్రేజీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సీఎస్ ఈ జాక్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్‌గా పుష్ప 2 (Pushpa 2), సుడల్ 2 (Sudal 2) వంటి చిత్రాల్లో శామ్ సీఎస్ అందించిన ఆర్ఆర్ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతోన్న శామ్ సీఎస్ ‘జాక్’ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్నాడని మేకర్స్ ప్రకటించడంతో.. జాక్ సినిమాలో సిద్దుని ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారా? అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
Next Story