- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Thandel Movie : మొదటి రోజు " తండేల్ " మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

దిశ, వెబ్ డెస్క్ : చందూ మొండేటి ( Chandoo Mondeti ) డైరెక్షన్ లో నాగ చైతన్య ( Naga Chaitanya ) హీరోగా నటించిన చిత్రం 'తండేల్' ( Thandel ). ఈ మూవీ ప్రస్తుతం, పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. బుక్‌మై షోలో 24 గంటల్లో 2 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. ముఖ్యంగా, సినిమాలోని పాటలు, బీజీఎమ్, హీరో హీరోయిన్ ల లవ్ స్టోరీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు నుంచే మంచి వసూళ్లను రాబట్టింది.
ఫస్ట్ డే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.21.27 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాగ చైతన్య కెరిర్లో మొదటి రోజు హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వసూళ్లు రాబట్టిన సినిమాగా తండేల్ నిలిచింది.
మొదటి రోజు తెలుగులో ఆక్యుపెన్సీ విషయంలో కూడా " తండేల్ " తన సత్తా చాటింది. మార్నింగ్ షోస్ లో 47.04% ఆక్యుపెన్సీని నమోదు చేయగా, మధ్యాహ్నం 44.76%, ఈవెనింగ్ 51.40%, రాత్రి 71.10%కి వరకు ఆక్యుపెన్సీ పెరిగింది. ఇలా మొత్తంగా ఫస్ట్ డే 53.58% ఆక్యుపెన్సీని సాధించింది.
మరోవైపు ఇతర దేశాల్లోకూడా తండేల్ పేరు బాగా వినబడుతోంది. ఓవర్సీస్ లో ఫస్ట్ డే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. 3 లక్షల 50వేల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి చైతూ కెరియర్లో ఒక రికార్డు క్రియోట్ చేసింది. ఈ విషయాన్ని చెబుతూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ను షేర్ చేశారు. 'అలలు మరింత బలపడుతున్నాయి' అనే క్యాప్షన్ పెట్టి ఫోటోను షేర్ చేశారు.