Teja Sajja: ఆయన ప్రశంస నా కెరీర్‌ను చాలా స్పెషల్ చేసింది.. తేజ సజ్జా ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
Teja Sajja: ఆయన ప్రశంస నా కెరీర్‌ను చాలా స్పెషల్ చేసింది.. తేజ సజ్జా ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) ఈ ఏడాది ‘హనుమాన్’(Hanuman) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడంతో తేజ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘మిరాయ్’(Mirai) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా, తేజ సజ్జా ‘X’ ద్వారా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. తనకు ఓ స్టార్ హీరో ప్రశంసలు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ‘‘2024 చివరకు వచ్చింది. అయితే ఈ ఏడాది నేను అందుకున్న గొప్ప ప్రశంస గురించి చెప్పాలని చాలామంది అడిగారు. అందుకే చెప్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) ప్రశంసలు నన్ను కదిలించాయి. ఎంతో పర్సనల్‌గా అనిపించింది. అందుకే ఇన్ని రోజులు ఎవరికీ వెల్లడించకుండా మనసులోనే దాచుకున్నాను.

ఆయన నా వర్క్ గురించి మాట్లాడిన విధానం నాకు చాలా నచ్చింది. ఎంతో ప్రేమ చూపించి చిన్న విషయాలను కూడా గమనించి ప్రోత్సహించారు. ఇది కేవలం ప్రశంస మాత్రమే కాదు.. స్వచ్ఛమైన ప్రోత్సాహం. ఆయన చెప్పిన ప్రతి మాట హృదయం నుంచి వచ్చినదే. నా కెరీర్‌ను మరింత ప్రత్యేకం చేసినందుకు ధన్యవాదాలు(Thank you) రణ్‌వీర్ భాయ్. లవ్ యూ’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా రణ్‌వీర్‌తో కలిసి తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed