- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kanguva : కంగువా మూవీ విడుదలపై హైకోర్టు స్టే
దిశ, వెబ్ డెస్క్ : భారీ అంచనాలతో ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన తమిళ మూవీ కంగువా(Kanguva) విడుదల(release)కు చైన్నై హైకోర్టు(Chennai High Court) బ్రేక్ వేసింది. కంగువా సినిమా నిర్మాత కేఈ జ్ఞానవేల్ తమ వద్ద రూ.99 కోట్లకి పైగా అప్పు తీసుకున్నాడని.. కానీ ఇందులో రూ.45 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. తమకి ఇవ్వాల్సిన డబ్బుని పూర్తిగా చెల్లించే వరకూ కంగువా సినిమా రిలీజ్‌ని నిలిపివేయాలని ఆ సంస్థ అభ్యర్థించింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన చెన్నై కోర్టు ఈ సినిమా రిలీజ్‌పై స్టే(Stay on release) విధించింది. ఈ కేసుని నవంబరు 7న విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. అయితే కోర్టు స్టే నేపథ్యంలో నిర్మాతలు వివాద పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. మూవీ రిలీజ్‌కు సానుకూలమైన పరిష్కారం లభిస్తుందనే యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ఒకవేళ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకి అనుకూలంగా తీర్పు వస్తే నవంబరు 14న థియేటర్లలోకి కంగువా రావడం కష్టమేనంటున్నాయి కోలివుడ్ వర్గాలు. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం.. విక్రమ్ నటించిన తంగలాన్, అల్లు శిరీష్ నటించిన టెడ్డీ సినిమా కోసం గతంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ 100 కోట్లు ఫైనాన్స్ తీసుకొన్నారు. ఆ డబ్బుల చెల్లింపులో నిర్మాత బకాయి పడ్డారు. ఈ వివాదంలో వారి మధ్య చర్చలు విఫలం కావడంతో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. తమకు చెల్లించాల్సిన 55 కోట్ల రూపాయలు చెల్లించే వరకు కంగువ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టును తమ పిటిషన్‌లో కోరినట్టు సమాచారం.
తమిళ అగ్ర కథానాయకుడు సూర్య (Suriya) హీరోగా దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో శివ (siva) దర్శకత్వంలో నిర్మితమైన కంగువా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ కంగువా సినిమాను నిర్మించారు. తమిళ సినిమా పరిశ్రమ నుంచి కంగువా 1000కోట్ల వసూళ్ళ మార్కు అందుకోగలదని సినీ వర్గాల భావిస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన కంగువా సినిమా ప్రచార గ్లింప్స్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించడంతో చిత్ర విజయంపై నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇంతలోనే హైకోర్టులో కేసు దాఖలవ్వడం అభిమానులను కలవరపరుస్తోంది. వివాదం త్వరగా కొలిక్కి వచ్చి అనుకున్న తేదీకి సినిమా నిరాటంకంగా విడుదల కావాలని సూర్య అభిమానులు ఎదురుచూస్తున్నారు.