పేదలకు సాయం చేసేంత డబ్బు నా దగ్గర ఉంది.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2025-01-21 14:31:07.0  )
పేదలకు సాయం చేసేంత డబ్బు నా దగ్గర ఉంది.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ప్రజెంట్ ‘తండేల్’ చిత్రం(Tandel movie)తో బిజీగా ఉంది. ‘ఫిదా’(Fida) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. మొదటి చిత్రంతో మంచి మార్కులు అందుకుంది. తర్వాత పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలు ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్న ఈ అమ్మడు.. ప్రజెంట్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అంతే కాకుండా.. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తు్న్న ఈ నేచురల్ బ్యూటీ.. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్వకత్వంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’(Ramayana). ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముని పాత్రలో నటిస్తుండగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో మెప్పించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణదశలో ఉంది.

ఇదిలా ఉంటే.. ఇలా వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తు్న్న సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నా చిన్నతనంలో మా కుటుంబంలో మేమే ధనవంతులం అనుకునేదాన్ని, కానీ అప్పుడు మాదగ్గర అంతగా డబ్బు లేదు. కానీ ఇప్పుడు పేదలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సాయి పల్లవి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. బ్యూటీ మనసు కూడా నేచురల్‌గానే ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Next Story