- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు పిల్లలతో క్యూట్ ఫొటో షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బావ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం అభినయం రెండింటితో క్రేజ్ సొంతం చేసుకుంది. అలా స్టార్టింగ్‌లో మెయిన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిన్నది ఆ తర్వాత సెకండ్ హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.
అయితే ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. నేడు క్రిస్మస్ సందర్భంగా నేడు ప్రణీత తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఫ్యామిలీ (భర్త, ఇద్దరు పిల్లలు)తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ఎ లిటిల్ ఫెస్టివ్ చీర్’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. వావ్ ఇద్దరు పిల్లలు ఉన్నా నీ అందం ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి మీరు ఈ పిక్స్ పై ఓ లుక్ వేసేయండి.