- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాత్రికి రమ్మని నేరుగా అడుగుతారు.. కాస్టింగ్ కౌచ్‌పై అమీర్ ఖాన్ కూతురు షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (casting couch) అనేది ఎక్కువగా వినిపించే పదం. సినిమా అవకాశాల కోసం వెళ్లినప్పుడు కొందరు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్‌కు గురవుతున్నారు. అంతేకాకుండా.. ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్‌లో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఇప్పటికే పలువురు మీడియా ముందు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ‘దంగల్’ (Dangal) బ్యూటీ ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) కాస్టింగ్ కౌచ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘బాలీవుడ్ (Bollywood)లో అడుగు పెట్టడానికి ముందు సౌత్ (South)లో ఓ ఆఫర్ వచ్చింది. అది నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావించా. హైదరాబాద్ (Hyderabad)లో ఆ చిత్ర నిర్మాతను కలిసినప్పుడు ఆయన నాతో అనుచితంగా ప్రవర్తించారు. ‘మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏది చేయడానికైనా అంగీకరించాలి’ అన్నారు. సినిమాకు ఏం అవసరమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. రాత్రికి రమ్మని నేరుగా అడుగుతారు అంటూ ఆ నిర్మాత కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. దీంతో ఇబ్బందిపడి మౌనంగా వచ్చేశాను. ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశం రావడం చాలా కష్టం. ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశం అందుకున్నా రిఫరెన్స్ పేరుతో నిర్మాతలే 15% పారితోషికాన్ని తీసుకుంటారు’ అని చెప్పుకొచ్చారు. కాగా.. అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) ‘దంగల్’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఫాతిమా.. అందులో ఆమిర్ ఖాన్‌కు కూతురుగా నటించి మెప్పించింది. ‘నువ్వు నేను ఒక్కటవుదాం’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.