- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anjali: ‘ఇది అన్నింటికంటే గొప్పగా అనిపించింది’.. లవ్ యు ఆల్ అంటూ నటి ఆసక్తికర పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అంజలి (Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి తమిళంలో జీవా (Jiva) సినిమాతోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే మూవీ తెలుగులో డేర్ (Dare) అనే పేరుతో వచ్చింది. తర్వాత ఈ అమ్మడు 2006 లో ఫొటో మూవీలో అవకాశం దక్కించుకుంది.
తర్వాత ప్రేమలేఖ రాశా, షాపింగ్ మాల్ (Shopping mall) సినిమాల్లో తన ప్రతిభ కనబర్చి నటనతో ప్రేక్షకులందరినీ అబ్బురపరిచింది. ఈ అద్భుతమైన టాలెంట్ చూసిన మురుగదాస్ జర్నీ (Journey) చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఇందులో మధుమతి పాత్రలో కనిపించి.. డామినేటింగ్ క్యారెక్టర్‌తో అందరినీ ఆకట్టుకుంది.
ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Walkitlo Sirimalle Chettu) సినిమాలో సీతగా అవకాశం దక్కించుకుని.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అమాయకంగా, చిలిపి అమ్మాయిలా నటించి మెప్పించింది. వీటితో పాటుగా బలుపు సినిమాలో శృతిహాసన్(Shruti Haasan)తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కత్తరదు తమిళ్, హుంగనాసు (Hunganasu), ఆయుధం సీవోం..
అంగడి తేరు, మాగిజ్చి, రెట్టైసుజి (Rettaisuji), పయ్యన్స్, తూంగా నగరం, కరుంగళి (Karungali), కో, మంకథ, ఎంగేయుమ్, ఎప్పోతుమ్, మహారాజా, అరవాన్, కలకలప్పు, వాటికూచి, సెట్టై, సింగం 2, మసాలా, గీతాంజలి, రాణా విక్రమ, శంకరాభరణం, నిశ్శబ్దం, వకీల్ సాబ్, పావ కదైగల్, బైరాగీ (Bairagi) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
ఇకపోతే ఈ నటి తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈమె నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు థియేటర్లలో మళ్లీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటి అంజలి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘సీతమ్మ వాకిట్లోసిరిమల్లె చెట్టు సినిమాను మరోసారి జరుపుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ పునః విడుదల అన్నింటికంటే గొప్పగా అనిపించింది. లవ్ యు అందరికీ’’ అంటూ అంజలి రాసుకొచ్చింది.
READ MORE ...