ఆ పెళ్లైన స్టార్ సింగర్‌పై మోజు పడ్డ హీరో శర్వానంద్.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడా?

by Hamsa |   ( Updated:2023-09-27 07:00:25.0  )
ఆ పెళ్లైన స్టార్ సింగర్‌పై మోజు పడ్డ హీరో శర్వానంద్.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల తన ప్రేయసి రక్షితను పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మంచి కథలను ఎంచుకుంటున్నాడు. తాజాగా, శర్వానంద్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట సంచలనం సృష్టస్తోంది. శర్వానంద్ గమ్యం సినిమా మంచి హిట్ ఇచ్చింది. అయితే శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ స్టార్ సింగర్ పై మోజు పడ్డారట. కానీ ఆమెకు అప్పటికే పెళ్లయిపోయిందట. కానీ పెళ్లయిపోయింది అని తెలిసినా కూడా ఆ సింగర్ తో సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగించారంటూ అప్పట్లో కొన్ని వార్తలు ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేశాయి.

ఈ వార్త మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింగర్ స్మిత కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇక సింగర్ స్మిత కి శర్వానంద్ కి మధ్య ఓ ఈవెంట్ లో పరిచయం ఏర్పడడంతో అది కాస్త నెంబర్స్ మార్చుకునే వరకు వెళ్లిందట. గంటల కొద్ది ఫోన్లు కూడా మాట్లాడుకునేవారట. పీకల్లోతు ప్రేమలో మునిగి ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని తెలుస్తోంది. శర్వానంద్ ఈ విషయం గురించి తల్లిదండ్రులకు కూడా తెలిపాడట. కానీ ఆమెకు అప్పటికే పెళ్లి జరిగిపోయిందని తెలిసి శర్వానంద్‌ను ఆమెను కలవకుండా ఇంట్లోనే బంధించారట. ప్రస్తుతం ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed