Hebah Patel: నా లైఫ్‌లో బెస్ట్ డెసిషన్ తీసుకున్నది ఆ విషయంలోనే.. హెబ్బా ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kavitha |
Hebah Patel: నా లైఫ్‌లో బెస్ట్ డెసిషన్ తీసుకున్నది ఆ విషయంలోనే.. హెబ్బా ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: ‘కుమారి 21ఎఫ్’(Kumari 21F) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో తన పాత్రనే మెయిన్ లీడ్ కావడంతో ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ప్రస్తుతం ‘ఓదెల రైల్వే స్టేషన్‌’(Odela Railway Station)కి సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెల-2’(Odela-2)లో నటిస్తోంది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ లెటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా హెబ్బా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో జిమ్‌లో వర్క్ అవుట్స్ చేసి బాగా అయిసిపోయిన ఫేస్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఒక సంవత్సరంలో నా జీవితంలో బెస్ట్ డిసిషన్ తీసుకున్నది ఈ విషయంలోనే’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు గుడ్ డెసిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed