నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ టైటిల్స్ ఫిక్స్ చేసిన మూవీ టీమ్

by Gantepaka Srikanth |
నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ టైటిల్స్ ఫిక్స్ చేసిన మూవీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: డెవిల్ సినిమా(Devil Movie) తర్వాత సినిమాలకు సుదీర్ఘ గ్యాప్ ఇచ్చిన నందమూరి హీరో కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram).. క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanti) కీలక పాత్ర పోషిస్తుండగా.. మేజర్ సినిమాతో హిట్ అందుకున్న సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్‌(NTR Arts), అశోక క్రియేష‌న్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ టైటిల్‌ను మార్చి 8వ తేదీన రివీల్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ముందుగా మెరుపు, రుద్ర అనే టైటిల్స్ ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అందులో నిజం లేదనీ తెలిసింది. ప్రస్తుతం ఏ టైటిల్ ఫిక్స్ చేశారో అని నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed