- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Upasana: ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా గ్లోబల్ స్టార్ సతీమణి ఉపాసన సంచలన పోస్ట్.. వారికి కాదంటూ

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు ఉపాసన (Upasana)గురించి పరిచయం అక్కర్లేదు. ఈమె ప్రస్తుతం అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్(Vice Chairman of Apollo Hospitals)గా ఉంటూ.. ఇటు మెగా కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తుంది. మరోపక్క ఉపాసన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తనవంతు సాయం చేస్తూ మెగా కోడలు గొప్ప మనసు చాటుకుంటుంది. ఇప్పటికే ఉపాసన ఎంతో మందికి సేవలు అందించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఉపాసన అండ్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) ప్రేమించుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరు ఇరు కుటుంబీకుల మధ్య గ్రాండ్‌గా వివాహం జరుపుకున్నారు. ఏడడుగుల, మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లల ప్లాన్ చేసుకున్నారు.
దాదాపు వీరికి పదకొండేళ్ల తర్వాత ఓ పండండి పాప జన్మించింది. ఈ మెగా ప్రిన్సెస్‌కు క్లింకార(Clinkara) అని నామకరణం చేశారు. తరచూ ఉపాసన ఫ్యామిలీకి సంబంధించినవి, వెకేషన్స్ పలు ఫొటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. అందులో క్లింకార కూడా ఉన్నప్పటికీ.. ఫేస్‌ను మాత్రం ఎమోజీలతో కవర్ చేస్తూ ఫొటోలు షేర్ చేస్తారు. దీంతో మెగా ఫ్యాన్స్ డిసపాయింట్ కామెంట్స్ చేస్తుంటారు.
అయితే నేడు వాలెంటైన్స్ డే(Valentine Day). ఈ రోజును ప్రేమికులు ఎంతో మంది ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ రాసుకొచ్చింది. ‘‘వాలెంటైన్స్ డే అనేది 22 ఏళ్లు.. అలాగే అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం. మీ వయస్సు ముగిసినట్లైతే.. ఆంటీ దయచేసి వేచి ఉండండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day)’’. అంటూ నవ్వే ఎమోజీల్ని జోడించింది.