Namrata Shirodkar: ‘ఎప్పటికీ మీతోనే’.. పెళ్లిరోజున ఆసక్తికర పోస్ట్ పెట్టిన నమ్రత

by Anjali |
Namrata Shirodkar: ‘ఎప్పటికీ మీతోనే’.. పెళ్లిరోజున ఆసక్తికర పోస్ట్ పెట్టిన నమ్రత
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రిన్స్ అండ్ నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar)సినిమాల్లో నటించే క్రమంలో ప్రేమలో పడ్డారు. కాగా పెద్దలను ఒప్పించి.. ఒరు కుటుంబీకుల మధ్య సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు చిహ్నంగా గౌతమ్(GauthaSuperstar Mahesh Babum) అండ్ సితార(Sitara) జన్మించారు. సితార, గౌతమ్ సోషల్ మీడియాలో అభిమానుNamrata Shirodkar)లతో తరచూ టచ్‌లో ఉంటుంటారు. ఈ ఏజ్‌లోనే హీరో, హీరోయిన్ లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ఇప్పటికే నాన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాలో కుమారుడు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించగా.. సితార మాస్ స్టెప్పులేసి మరింత ఫేమ్ అయ్యింది. తరచూ ఈ ఘట్టమనేని గారాల పట్టి డ్యాన్స్ వీడియోలు, పలు వెకేషన్ వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. సూపర్ స్టార్ ఫ్యామిలీ సమయం దొరికితే చాలు.. విదేశాలకు వెళ్లి జాలిగా గడుపుతారు.

ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు అండ్ నమ్రతను అన్యోన్యమైన జంటగా అందరూ చెప్పుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక నమ్రత అయితే ఏకంగా పెళ్లి అనంతరం సినిమాలకే దూరమైంది. పూర్తిగా పిల్లల్ని.. కుటుంబ బాధ్యతల్ని మోస్తూ ఉత్తమ కోడలిగా పేరు సంపాదించుకుంది. ఇప్పటికీ కూడా మంచి భార్యగా నడుచుకుంటోంది.

అయితే నేడు నమ్రత-మహేష్ బాబు పెళ్లి రోజు(wedding day). ఈ సందర్భంగా వీరికి అభిమానులు సోషల్ మీడియా వేదికన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యానివర్సరీ సందర్భంగా నమ్రత అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ వేదికన సేమ్ పోస్ట్ ఒకే సమయంలో షేర్ చేశారు. ‘మన బ్యూటిపుల్ బంధానికి 20 ఇయర్స్ గడిచాయి. ఎప్పటికీ మీతోనే నా జీవితం. మీ నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని అంటూ రెండు లవ్ సింబల్స్ జోడించారు. అలాగే ఈ పోస్ట్‌లో ఇద్దరు నవ్వుతోన్న ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed