బిగ్‌బాస్ షో రీ ఎంట్రీ కోసం పవన్ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన రతిక?

by Hamsa |   ( Updated:2023-10-22 12:03:08.0  )
బిగ్‌బాస్ షో రీ ఎంట్రీ కోసం పవన్ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన రతిక?
X

దిశ, సినిమా: ఇటివల మొదలైన ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. మొదటి రోజు నుంచి నాగార్జున చెప్పినట్టుగానే హౌస్‌లో ఉల్టా పుల్టా అంటూ చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే ఎలిమినేషన్స్ విషయంలోనూ ఎవరూ ఉహించని ట్విస్ట్‌లుంటున్నాయి. 4 వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక మల్లి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

అలాగే హౌస్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌తో ఆమె నడిపిన డబల్ గేమ్ వల్లే ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించేశారు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రతికకు మంచి మూవీ ఆఫర్‌లు వస్తున్నాయి. రీసెంట్‌గా బాలయ్య హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’లో చిన్న పాత్రలో కనిపించింది రతిక. దీంతో పాటు ఎవరూ ఉహించని విధంగా రతికకు పవన్ అప్ కమింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ దక్కిందట. నవంబర్ నెలలో డేట్స్ కావాలని డైరెక్టర్ హరీష్ శంకర్ అడిగాడట. కానీ బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ కోసం ఈ అమ్మడు నో చెప్పేసిందట.

Advertisement

Next Story