‘పుష్ప-2’లో ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు చేశారా?

by Hamsa |
‘పుష్ప-2’లో ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు చేశారా?
X

దిశ, సినిమా: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ సినిమా 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్‌గా రాబోతుంది. ఇప్పటికే పుష్ప-2 షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించనున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ అంచనాలను పెంచాయి. షూటింగ్ మొదలై చాలా రోజులవుతున్నప్పటికీ ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.

కానీ పుష్ప-2 సినిమాకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా, పుష్ప-2లో ఓ సీన్ కోసమే ఏకంగా రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జాతర ఎపిసోడ్స్ ఉండనున్నాయట. మొత్తం 25 నిమిషాల పాటు ఉండే దానికోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఇందులో భాగంగా బన్నీ అర్ధనారీశ్వరుడిగా కనిపిస్తాడట. అంతేకాకుండా జాతరలో ఓ డివోషనల్ సాంగ్, భారీ ఫైట్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంత డబ్బు ఖర్చు చేస్తున్నారంటే అదే సినిమా మొత్తానికి హైలెట్ అవుతుందేమోనని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పుష్ప-2 గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Advertisement

Next Story