- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kannappa: ‘కన్నప్ప’ నుంచి ‘శివ శివ శంకర’ సాంగ్.. విష్ణు యాక్టింగ్‌పై ప్రేక్షకుల రియాక్షన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

దిశ, సినిమా: విష్ణు మంచు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ (Kannappa) రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేశారు చిత్ర బృందం. ఇక ఇటీవల వచ్చిన టీజర్ కూడా నెట్టింట ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఏప్రిల్ 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కాజల్, మోహన్ లాల్ (Mohan Lal), ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar), శరత్ బాబు (Sarath Babu) లాంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ఈ పాత్రలకు సంబంధించి విడుదల చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్లతో సినిమాపై హైప్ మరింత క్రియేట్ అయ్యింది.
ఇందులో భాగంగా ప్రతీ సోమవారం ఈ మూవీ నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తున్న చిత్ర బృందం.. తాజాగా ‘కన్నప్ప’ నుంచి ఫస్ట్ సింగిల్ (First single) ‘శివ శివ శంకర’ (Shiva Shiva Shankara) ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్‌కు ప్రజెంట్ నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. అంతే కాదు విష్ణు యాక్టింగ్‌కు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో.. ‘ఈ శివరాత్రికి ఇదే పాట ప్రతి గుడిలో మోగుతుంది’ అని ‘ఫస్ట్ టైమ్ ఈ సినిమాపై అండ్ మంచు విష్ణుపై పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని’, ‘ఈ ఒక్క సాంగ్‌తో సినిమా హిట్టు కొట్టడం పక్కా’ అంటూ పాజిటివ్ కామెంట్స్ ఇన్‌బాక్స్ నింపేస్తున్నారు నెటిజన్లు. కాగా.. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించారు.