Vishwak Sen: అందరిది ఒకటే కాంపౌండ్.. విశ్వక్ సేన్ ట్వీట్ వైరల్

by sudharani |
Vishwak Sen: అందరిది ఒకటే కాంపౌండ్.. విశ్వక్ సేన్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) త్వరలో ‘లైలా’ (Laila) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. రామ్‌ నారాయణ్‌ (Ram Narayan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ నెల 14న విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ప్రీ రిలీజ్ (Pre release) ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ముఖ్య అథితిగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హాజరయ్యారు.

ఇందులో భాగంగా విశ్వక్ సేన్ మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఆ కాంపౌండ్, ఈ కాంపౌండ్ కాదు అందరిది ఒకటే కాంపౌండ్ “సినిమా కాంపౌండ్”.... చిరంజీవి గారూ, నాకు అండ్ మా చిత్రం ‘లైలా’ పట్ల మీకున్న ఎనలేని ప్రేమ అండ్ మద్దతుకు చాలా ధన్యవాదాలు. పరిశ్రమలో ఐక్యతపై మీ ప్రసంగం నిజంగా స్ఫూర్తిదాయకం.. అలాగే ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది ఎంతో అవసరం. మీ తిరుగులేని మద్దతుతో, నేను ముందుకు వెళ్లే మార్గాన్ని మార్చడానికి మరింత శక్తివంతంగా భావిస్తున్నాను. బాస్ ఈజ్ బాస్’ అంటూ లవ్ సింబల్స్ షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Next Story