- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tollywood: ఇంత క్యూట్ పిల్లను నేను ఎక్కడా చూడలేదు.. సినిమాలన్నీ ఫ్లాప్ కానీ జాక్ పాట్ కొట్టేసిందిగా!

దిశ, వెబ్ డెస్క్: Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. అందం, అభినయంతో మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు కొంతమంది హీరోయిన్లు. నటించిన చిత్రం అట్టర్ ప్లాప్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా అంతే. చేసిన మూవీస్ అన్నీ అట్టర్ ప్లాప్. అయినా వరుసబెట్టి ఛాన్సులు వస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటుంది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు అన్ని భాషల్లోనూ కలిపి మూడూ సినిమాల్లో నటిస్తే అన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో చూద్దాం. ( Pic credit: Instagram భాగ్యశ్రీకిబోర్స్)
ఆ హీరోయిన్ మరెవరో కాదు భాగ్యశ్రీ బోర్సే. ఈ మధ్య మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.
ఈ మూవీతో భాగ్యశ్రీ బోర్సే మాత్రం చాలా ఫేమస్ అయ్యింది. అందం, అభినయంతో మంచి మార్కులనే కొట్టేసింది. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ అందంగా డ్యాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది ఈ బ్యూటీ.
మోడలింగ్ రంగం నుంచి కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ యారియాన్ 2 మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో ఆమె నటించిన సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి.
మిస్టర్ బచ్చన్ మూవీ కూడా ప్లాప్ అయినప్పటికీ భాగ్య శ్రీ బోర్సెకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ఈ మూవీలో నటిస్తోంది. అలాగే మరో ఆరు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది.