Trivikram Srinivas: త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు బ్యాగులు ఎందుకు వేసుకుంటారో తెలుసా?

by Prasanna |   ( Updated:2025-02-06 07:14:00.0  )
Trivikram Srinivas: త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు బ్యాగులు ఎందుకు వేసుకుంటారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) కూడా ఒకరు. డైలాగ్ రైటర్ నుంచి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే, ఈయన తీసిన సినిమాలలో చాలా వరకు హిట్ అయ్యాయి. కానీ, ఈ మాటల మాంత్రికుడు మూవీస్ లో సెంటిమెంట్ లాగా ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది, ఇప్పటి వరకు అన్నీ సినిమాల్లో కనిపించింది. అదేంటంటే, ఆయన చిత్రాల్లో హీరోలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా భుజాన బ్యాగు వేసుకుని ప్రయాణం చేయాల్సిందే. దీనిని వేసుకుని ఒకచోట నుంచి మరొక చోటకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన సినిమాలను ఒకసారి గమనిస్తే మనకు ఈ కామన్ పాయింట్ అర్థం అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ " అత్తారింటికి దారేది " ( Atharintiki Daaredi ) మూవీలో హీరో తన అత్త కోసం బ్యాగు సర్దుకుని ఇండియాకు వస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ మరో చిత్రం " జల్సా " ( Atharintiki Daaredi ) లో కూడా నక్సలైట్ నుంచి జనాల్లోకి రావడానికి బ్యాగ్ ను పట్టుకుని వస్తాడు. అలాగే, పవన్ నటించిన మరో సినిమా " అజ్ఞాతవాసి " లో హీరో తన కుటుంబానికి దూరంగా ఉంటాడు. మళ్ళీ వారి దగ్గరకు వచ్చేటప్పుడు మళ్లీ బ్యాగు వేసుకుని వస్తాడు.

అలాగే, ఎన్టీఆర్ " అరవింద సమేత వీర రాఘవ " చిత్రంలో హీరో తన గ్రామం లో ఫ్యాక్షన్ గొడవల నుంచి దూరంగా ఉండటానికి బ్యాగ్ తో పట్టణానికి వస్తాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన " అల‌ వైకుంఠపురం " లో సినిమాలో కూడా బ్యాగ్ తో వేరే చోటికి వెళ్తాడు. " అఆ " చిత్రంలో కూడా హీరో నితిన్ బ్యాగ్ తో చాలా ప్రదేశాలుకు తిరుగుతాడు. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసే అన్ని సినిమాల్లో హీరో బ్యాగ్ పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే అట.. ఈ పాయింట్ తో చాలా సినిమాలు హిట్ అవ్వడంతో, అప్పటి నుంచి దీనినే ఫాలో అవుతున్నారట.

Next Story

Most Viewed