వరుణ్-లావణ్యకు నందమూరి బాలకృష్ణ పంపిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-11-05 11:19:41.0  )
వరుణ్-లావణ్యకు నందమూరి బాలకృష్ణ  పంపిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్-లావణ్య ‘మిస్టర్’ మూవీతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా కొన్నేళ్లపాటు తమ ప్రేమను కొనసాగించారు. ఇక ఇటీవల పెద్దలను ఒప్పించి జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక నవంబర్ 1న ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకుని వివాహ బంధం లోకి అడుగు పెట్టారు. పెళ్లి అనంతరం కొత్త జంట హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఫ్యాన్స్ వరుణ్-లావణ్యలపై పూల వర్షం కురిపించి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అయితే వీరిద్దరి రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..

తాజాగా, వరుణ్-లావణ్యకు నందమూరి బాలయ్య అదిరిపోయే గిఫ్ట్‌ను పంపారని ఓ వార్త వైరల్‌గా మారింది. నాగబాబు, ఆయన భార్యకు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారట. అంతేకాకుండా వరుణ్ తేజ్ కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామినే నమ్ముకుని మొక్కుతాడట. దీంతో బాలయ్య వెంకటేశ్వర స్వామి పెద్ద ఫొటోగ్రఫీని గిఫ్ట్‌గా పంపించారట. ఇందులో స్పెషల్ ఏంటంటే.. పుల్లలతో ప్రత్యేకంగా తయారు చేయించి మరీ పంపారట. అంతేకాదు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలని గ్రీటింగ్ కార్డ్ కూడా పంపాడట. దీంతో అది తెలిసిన కొందరు బాలయ్య కోటి రూపాయల బహుమతి పంపొచ్చు కానీ వారికి నచ్చింది పంపడం ముఖ్య కాబట్టి దేవుడినే వారికి ఇవ్వడం గొప్ప విషయం అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

వరుణ్ పెళ్లిలో.. పాపం శ్రీజ ఒక్కతే అలా ఉండిపోయింది?

Advertisement

Next Story