‘ఛావా’ మూవీకి భారీ రెమ్యునరేషన్ తీసుకున్న విక్కీ.. ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Hamsa |   ( Updated:2025-02-17 13:55:21.0  )
‘ఛావా’ మూవీకి భారీ రెమ్యునరేషన్ తీసుకున్న విక్కీ.. ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. విక్కీ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు. ఇక ఛత్రపతి శివాజీ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’చిత్రంతో ప్రేక్షకులను అలరించారు.హరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 164 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ‘ఛావా’ చిత్రం థియేటర్స్‌లో చూసిన వారంతా బోరున ఏడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుండగా.. అంతా ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట ఎక్కడ చూసిన ‘ఛావా’ గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, విక్కీ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఈ సినిమా కోసం ఆయన రూ.10 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఇక అది తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు ఆయన నటనకు ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పులేదని అంత అద్భుతంగా చేశాడని అంటున్నారు.

Next Story

Most Viewed