Naga Chaitanya-Shobhita: నాగచైతన్య-శోభిత మధ్య అన్ని సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందా?

by Hamsa |   ( Updated:2024-11-30 10:07:01.0  )
Naga Chaitanya-Shobhita: నాగచైతన్య-శోభిత మధ్య అన్ని సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) పెద్ద కొడుకు నాగచైతన్య-శోభిత పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డిసెంబర్ 4న గ్రాండ్‌గా వీరిద్దరి వివాహం అక్కినేని నాగేశ్వర రావు(Nageshwara Rao)కు ఎంతో ఇష్టమైన అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్(Akhil) పెళ్లి చేసుకోబోతున్నట్లు నాగార్జున ట్విట్టర్ ద్వారా ప్రకటించి షాకిచ్చాడు. జైనబ్‌తో పెళ్లి పీలెక్కబోతున్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఏకంగా 9 ఏళ్ల వ్యత్యాసం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala) మధ్య ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. నవంబర్ 23 1986లో చైతు జన్మించగా ఇటీవల 38 ఏళ్లు వచ్చాయి. ఇక శోభిత 1992 మే 31న జన్మించగా.. ఆమెకు 32 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య 6 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. ప్రజెంట్ ఇదే విషయం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.


Also Read...

శృంగారం లేకుండా లైఫ్ లేదు.. ఇంటిమేట్ సీన్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Advertisement

Next Story

Most Viewed