అక్కినేని అభిమానులకి దివాళి గిఫ్ట్.. పండుగ వేళ నాగార్జున ఇంటికి రాబోతున్న కొత్త కోడలు!

by Hamsa |   ( Updated:2023-11-12 07:10:29.0  )
అక్కినేని అభిమానులకి దివాళి గిఫ్ట్.. పండుగ వేళ నాగార్జున ఇంటికి రాబోతున్న కొత్త కోడలు!
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ‘సిసింద్రీ’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మనం మూవీలో గెస్ట్ రోల్ చేశాడు. హలో మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మజ్ను వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల వచ్చిన ఏజెంట్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో అప్పటి నుంచి ఏ కొత్త సినిమా ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా, అఖిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పండుగకు అక్కినేని ఇంటికి కొత్త కోడలు రాబోతుందట. అఖిల్ ఓ బడా బిజినెస్ మ్యాన్ మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబం గురించి అన్ని తెలిసిన ఆయన తన మనవరాలిని కోడలుగా పంపడానికి ఒప్పుకున్నారట. అంతేకాకుండా దీపావళి సందర్భంగా కాబోయే కోడల్ని నాగార్జున, అమల ఇంటికి ఆహ్వానించారట. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసి ఫైనల్ ముముర్తాన్ని అభిమానులకు తెలపాలని నాగార్జున అనుకుంటున్నారట. ఆశ్చర్యం ఏంటంటే.. ఆ స్టార్ బిజినెస్ మాన్ మనవరాలే అఖిల్‌కు ప్రపోజ్ చేసిందంట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story