- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారా..!
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. వరుస చిత్రాల్లో నటిస్తూ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ మిగతా హీరోయిన్స్‌లా సినిమాలకు దూరం కాకుండా ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అయితే దీపికా- రణవీర్ పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ పిల్లల గురించి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. ఈ క్రమంలోనే.. ఇటీవల ఈ జంట ఓ ఈవెంట్‌కు వెళ్తుండగా అందులో దీపికా బేబీ బంప్ వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ పలు వార్తలు హల్ చల్ చేశాయి.
ఈ నేపథ్యంలో దీపికా పదుకొనే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ఈ ఏడాది 2024 సెప్టెంబర్‌లో తాము తల్లిదండ్రులము కాబోతున్నామంటూ పోస్ట్ షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా, దీపికా-రణవీర్ దంపతులకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె పెట్టిన పోస్ట్‌లో బ్లూ, పింక్ షేడ్స్‌లోని షూస్, టోపీలు, ఫ్రాక్ ఇతర బొమ్మలు అందుకే డబుల్ పెట్టిందని నెట్టింట చర్చలు మొదలెట్టారు. పింక్ కలర్ ఆడబిడ్డకు, బ్లూ మగబిడ్డకు సంకేతం కాబట్టి హింట్ ఇస్తూ ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు. కానీ దీపికా ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ అబద్ధాలు ఆమెకు ఇంకా మూడో నెల కాబట్టి బేబీ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది అందుకే రెండు కలర్స్ పెట్టిందని ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు.
- Tags
- deepika padukone