బిగ్‌బాస్ ఫేమ్ RJ శేఖర్‌పై మరో కేసు.. జానీ మాస్టర్ కేసుతో సంబంధం!

by D.Reddy |
బిగ్‌బాస్ ఫేమ్ RJ శేఖర్‌పై మరో కేసు.. జానీ మాస్టర్ కేసుతో సంబంధం!
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ ఫేమ్, RJ శేఖర్ బాషాపై నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో తాజాగా మరో కేసు నమోదు అయింది. మహిళ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, గతంలో తనపై లైంగిక దాడి చేశాడని శ్రేష్టి వర్మ ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే, ఆ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్ రికార్డులు లీక్ చేశాడని శేఖర్ బాషాపై శ్రేష్టి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో మాట్లాడుతున్నాడని, దురుద్దేశపూర్వకంగానే కాల్ రికార్డులు లీక్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్‌తో పాటు అతని వద్ద ఉండే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయాలని ఆమె పోలీసులను కోరారు. ఈ మేరకు శేఖర్ బాషాపై పోలీసులు BSN యాక్ట్ సెక్షన్79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు.

కాగా, శేఖర్ బాషాపై హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడని, పర్సనల్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించి ఓ హార్డ్ డిస్క్‌ని కూడా లావణ్య పోలీసులకు అందజేసింది. ఈ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇదే సమయంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై కూడా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషా, మస్తాన్ సాయి కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించింది. దీంతో పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించారు.

Next Story