- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం కాదు.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సుదీప్
దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ఇటీవల ‘మ్యాక్స్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ డిసెంబర్ 25న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీప్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘నేను సినిమాలు చేస్తే హీరోగానే నటించాలనుకుంటున్నాను. ఇటీవల కొన్ని ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేశాను. దానికి కారణం కథలు నచ్చకపోవడం వల్ల కాదు. ఈ సమయంలో వాటిని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం కాదనిపిస్తుంది.
నటనకు విరామం తీసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యే ప్రసక్తే లేదు. ఒకవేళ ప్రధాన పాత్ర అవకాశాలు రాకపోతే దర్శకత్వం, ప్రొడక్షన్ వైపు వెళ్తాను. నేను ఇప్పటి వరకు సాధించిన దానికి ఎంతో సంతృప్తిగా ఉన్నాను. ప్రతి హీరో ఏదో ఒక సమయంలో బోర్ కొట్టేస్తాడు. అందరికీ ఒక టైమ్ అనేది ఉంటుంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఒక హీరోగా నేనెప్పుడూ సెట్‌లో ఎవరినీ వెయిట్ చేయించలేదు. భవిష్యత్తులో సపోర్టింగ్ రోల్‌లో చేస్తే. ఇంకొకరి కోసం ఎదురుచూస్తూ కూర్చోను’’ అని చెప్పుకొచ్చారు.